Botsa Satyanarayana: శాసనమండలి నుంచి వాకౌట్ చేసిన మంత్రి బొత్స

  • మండలిలో కరవుపై చర్చ
  • పలు ప్రశ్నలను సంధించిన విపక్ష సభ్యులు
  • చర్చ జరుగుతుండగానే వెళ్లిపోయిన బొత్స

ఏపీ శాసనమండలి సమావేశాల సందర్భంగా సభ నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ వాకౌట్ చేశారు. సభ నుంచి మంత్రి వాకౌట్ చేయడంతో అధికార, విపక్షాలకు చెందిన సభ్యులు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యారు.

వివరాల్లోకి వెళ్తే, ఈనాటి సమావేశాలు ప్రారంభమైన వెంటనే శాసనమండలిలో కరవు, అనావృష్టిపై చర్చ ప్రారంభమైంది. విపక్ష సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు బొత్స సమాధానమిస్తూ... జిల్లాల నుంచి నివేదికలు తెప్పిస్తున్నామని... త్వరలోనే లెక్కలన్నీ తేలుతాయని చెప్పారు. చాలా ప్రాంతాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదైందని... ఎవరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు? ఎలాంటి పరిస్థితుల్లో చేసుకున్నారు? అనే అంశాలపై నివేదికలు తయారవుతున్నాయని తెలిపారు.

ఇదే సమయంలో గత టీడీపీ ప్రభుత్వంపై బొత్స విమర్శలు గుప్పించారు. రైతుల పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ద్వజమెత్తారు. బొత్స మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో, చర్చ కొనసాగుతుండగానే సభ నుంచి బొత్స వెళ్లిపోయారు. మంత్రి నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో... టీడీపీ సభ్యులు కూడా సభ నుంచి వెళ్లిపోయారు. వాకౌట్ పై బొత్స ఇంకా స్పందించాల్సి ఉంది.

More Telugu News