Rishabh Pant: ధోనీ స్థానాన్ని భర్తీ చేసేలా రిషభ్ పంత్ ఎదగాలి: ఎంఎస్కే ప్రసాద్

  • భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పంత్ ను సెలెక్ట్ చేశాం
  • వర్క్ లోడ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ పంత్ ఎదగాలి
  • పంత్ ను సానపట్టడమే మా ప్రస్తుత లక్ష్యం

విండీస్ టూర్ కు తాను అందుబాటులో ఉండనంటూ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ప్రకటించడంతో యువ ఆటగాడు రిషభ్ పంత్ కు జట్టులో స్థానం లభించింది. వెస్టిండీస్ పర్యటనకు ప్రకటించిన టీమిండియా జట్టులో ఏకైక వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ రిషభ్ పంత్ మాత్రమే. దీంతో, పంత్ కు సిరీస్ మొత్తం ఆడే అవకాశం లభించినట్టైంది.

జట్టును ప్రకటిస్తున్న సమయంలో చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ, పంత్ ను మూడు ఫార్మాట్లకు ఎంపిక చేశామని తెలిపాడు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పంత్ ను సెలెక్ట్ చేశామని... వికెట్ కీపర్-బ్యాట్స్ మెన్ గా బాధ్యతలను నిర్వహించడం సవాళ్లతో కూడుకున్న అంశమని చెప్పాడు. తన వర్క్ లోడ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ, పంత్ ఎదగాలని ఆకాంక్షించాడు. ధోనీ స్థానాన్ని భర్తీ చేసే విధంగా పంత్ ఎదగాలని చెప్పాడు. ఈ సిరీస్ కు ధోనీ అందుబాటులో లేడని తెలిపాడు. ప్రపంచ కప్ వరకు తమకు కొన్ని రోడ్ మ్యాప్స్ ఉన్నాయని... ప్రస్తుత పరిస్థితుల్లో పంత్ ను సానపట్టడమే తమ లక్ష్యమని చెప్పాడు.

  • Loading...

More Telugu News