elecrticity: విద్యుత్‌ ఒప్పందాలపై సమీక్షా సమావేశానికి ఎన్టీపీసీ, ఎస్‌ఈసీఐ డుమ్మా?

  • హాజరు కాకూడదని నిర్ణయం
  • రాష్ట్ర ప్రభుత్వంపై చట్టపరమైన చర్యకు అడుగులు
  • ఒప్పందాలను పునఃపరిశీలించాలని నిర్ణయించిన సర్కారు

విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు, దీనిపై ఈరోజు నిర్వహించ తలపెట్టిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి ఎన్టీపీసీ, ఎస్‌ఈపీఐలు హాజరు కాకూడదని నిర్ణయించాయి. టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాలను అవసరమైతే పునఃపరిశీలన చేస్తామని జగన్‌ సర్కారు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై గత కొన్ని రోజులుగా వాదనలు నడుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో జరగనున్న సమావేశానికి ఈ సంస్థలు హాజరు కాకూడదని నిర్ణయించాయి. అదే సమయంలో ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తమకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకునే ఒప్పందాలు సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ నిబంధనల ప్రకారమే జరుగుతాయని, అటువంటి ఒప్పందాలు పునఃపరిశీలన అభివృద్దికి విఘాతమని ఈ సంస్థలు భావిస్తున్నాయి.

More Telugu News