sushma swaraj: మీరు కూడా దూరమవుతారన్న నెటిజన్‌కు వెంటనే సమాధానం ఇచ్చిన సుష్మా స్వరాజ్

  • శనివారం కన్నుమూసిన షీలా దీక్షిత్
  • ఏదో ఒక రోజు మీరు కూడా మాకు దూరమవుతారన్న నెటిజన్
  • తన మరణంపై ఊహకు ధన్యవాదాలన్న మాజీ మంత్రి
తన మరణాన్ని ఊహించిన ఓ నెటిజన్‌కు కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ దీటుగా బదులిచ్చారు. ఇటీవల మృతి చెందిన ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ లానే మీరు కూడా ఏదో ఒకరోజు మాకు దూరమవుతారంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా, ఆమె ధన్యవాదాలు తెలిపారు.

బీజేపీ మాజీ అధ్యక్షుడు మంగేరామ్ గార్గ్ మృతికి సుష్మా స్వరాజ్ ట్విట్టర్‌లో సంతాపం తెలిపిన సందర్భంగా ఓ నెటిజన్ స్పందించాడు. ఇర్ఫాన్‌ ఏ ఖాన్‌ అనే ఈ నెటిజన్ ఆదివారం ట్వీట్ చేస్తూ.. మీరు కూడా ఏదో ఒక రోజు మాకు దూరమవుతారని పేర్కొన్నాడు. అతడి ట్వీట్‌కు సుష్మ వెంటనే స్పందించారు. తన మరణం విషయంలో ఈ తరహా ఊహకు ధన్యవాదాలని బదులిచ్చారు.

 కాగా, 15 ఏళ్లపాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆదివారం నిగమ్‌బోధ్ ఘాట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
sushma swaraj
sheila dixit
Twitter
Netizen

More Telugu News