Andhra Pradesh: నాలుగు రంగాల్లో ఏపీకి నిధులు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు సంసిద్ధత!

  • అమరావతి నిర్మాణంపై వెనుకంజ వేసిన ప్రపంచ బ్యాంకు
  • ఏపీ సర్కారుపై విమర్శలు
  • మనసు మార్చుకున్న ప్రపంచ బ్యాంకు!
ఇటీవలే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చే విషయంలో వెనుకంజ వేసిన ప్రపంచ బ్యాంకు మరోవిధంగా రాష్ట్రానికి సాయం చేసేందుకు ముందుకొచ్చింది. నాలుగు కీలక రంగాల్లో రాష్ట్రానికి నిధులు ఇస్తామంటూ ప్రతిపాదించింది. వ్యవసాయం, విద్యుత్, ఆరోగ్యం, ప్రకృతి విపత్తులకు భారీగా నిధులు ఇస్తామంటూ సంసిద్ధత వ్యక్తం చేసింది. అమరావతి నిధుల విషయంలో ప్రపంచబ్యాంక్ అనూహ్యనిర్ణయం నేపథ్యంలో ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ప్రపంచ బ్యాంకు తీసుకున్న నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి కచ్చితంగా ఊరట కలిగించే అంశం అని చెప్పాలి.
Andhra Pradesh
World Bank
Amaravati

More Telugu News