Sheila Dikshit: కాంగ్రెస్ క్యాడర్ కు షీలా దీక్షిత్ చివరి ఆదేశాలు ఇవే!

  • బీజేపీ కార్యాలయం ముందు నిరనస చేపట్టండి
  • కార్యకర్తలు, నేతలు తరలిరావాలి
  • శుక్రవారం నాడు ఆదేశించిన షీలా దీక్షిత్
మరణించడానికి ఒక రోజు ముందు కూడా ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్, కాంగ్రెస్ కార్యకర్తలకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఆమె క్యాబినెట్ లో పని చేసిన ఓ నేత ఈ విషయాన్ని వెల్లడించారు. తుది శ్వాస విడిచే వరకూ ఆమె రాజకీయాల్లో చురుకుగా ఉన్నారని తెలిపారు. శుక్రవారం నాడు ఆమె పార్టీ వర్గాలకు ఓ సందేశం పంపుతూ, యూపీలో ప్రియాంక గాంధీకి, ఆదిత్య నాథ్‌ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదం శనివారం నాటికి ముగియకుంటే, బీజేపీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన ప్రదర్శన చేపట్టాలని ఆమె ఆదేశించారు. దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ్ మార్గ్‌ లో ప్రదర్శన నిర్వహించాలని, దీనికి నేతలు, కార్యకర్తలుతరలి రావాలని పార్టీ శ్రేణులకు ఓ సందేశాన్ని ఆమె పంపారు. కాగా, ప్రియాంక యూపీ పర్యటనను శుక్రవారం పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఆపై ఆమెను అరెస్ట్ చేసి, విడిచిపెట్టగా, తాను బస చేసిన అతిథి గృహం వద్ద నిన్న ఆమె బాధిత కుటుంబాలను పరామర్శించారు.
Sheila Dikshit
Congress
Passes Away
Delhi
BJP

More Telugu News