Uber: ఉబెర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన దివంగత చక్రి సోదరుడు!

  • యాక్సిడెంట్ జరిగితే పట్టించుకోలేదు
  • బంజారాహిల్స్ పోలీసులకు మహిత్ ఫిర్యాదు
  • కేసు దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు

క్యాబ్ సేవల సంస్థ ఉబర్‌ పై టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, దివంగత చక్రి సోదరుడు మహిత్ నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులకు మహిత్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఆయన ఉబర్ క్యాబ్‌ లో ప్రయాణిస్తున్న వేళ, రోడ్డు ప్రమాదం జరిగినా పట్టించుకోలేదు. అయితే, ఈ ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ జరిగింది? దీనికి ఉబెర్ డ్రైవరే కారణమా? అన్న విషయాలు బయటకు తెలియరాలేదు. మహిత్ నారాయణ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఉబెర్ సంస్థపై గతంలోనూ పలు ఫిర్యాదులు వచ్చాయి. తాజా ఘటనపై ఆ సంస్థ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

  • Loading...

More Telugu News