Pro Kabaddi: ప్రో కబడ్డీ లీగ్... తొలి పోరులో తెలుగు టైటాన్స్ ఘోర పరాజయం!

  • ఉత్సాహంగా ప్రారంభమైన ప్రో కబడ్డీ లీగ్
  • 31-25 తేడాతో తెలుగు టైటాన్స్ ఓటమి
  • మరో మ్యాచ్ లో గెలిచిన బెంగళూరు బుల్స్
ప్రో కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ప్రారంభం కాగా, సొంత వేదికపై నిన్న రాత్రి జరిగిన తొలి పోటీలో తెలుగు టైటాన్స్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. యూ ముంబా జట్టుతో తొలి మ్యాచ్ ఆడిన తెలుగు టైటాన్స్ 31-25 తేడాతో ఓడిపోయింది.

మరో మ్యాచ్ లో పట్నా పైరేట్స్ పై బెంగళూరు బుల్స్ 34-32 తేడాతో శ్రమించి ఓడిపోయింది. ఈ మ్యాచ్ ఆసాంతం విజయలక్ష్మి ఇరు జట్ల మధ్యా దోబూచులాడుతూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసింది. కాగా, నేటి రాత్రి 7.30 గంటలకు బెంగళూరు బుల్స్‌, గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ మధ్య, రాత్రి 8.30 గంటలకు తెలుగు టైటాన్స్‌, తమిళ్‌ తలైవాస్‌ మధ్య పోరు జరుగనుంది.
Pro Kabaddi
Telugu Titans
U Mumba

More Telugu News