దళితుల కోసం ఏం చేయాలో జగన్ కు తెలుసు.. మంద కృష్ణ చెప్పక్కర్లేదు!: వైసీపీ ఎంపీ నందిగం సురేశ్
- జగన్ పై విమర్శలు చేసిన మంద కృష్ణ
- ఘాటుగా స్పందించిన బాపట్ల ఎంపీ
- హైదరాబాద్ నుంచి వచ్చి హడావుడి చేయడం వెనుక ఆంతర్యమేంటని నిలదీత
అయినా, ఉన్నట్టుండి హైదరాబాద్ నుంచి వచ్చి ఇంత హడావుడి చేయడం వెనుక ఆంతర్యం ఏంటో మంద కృష్ణ చెప్పాలని నిలదీశారు. దళితుల కష్టాలన్నీ తీరిపోతే తన ప్రయోజనాలు దెబ్బతింటాయని మంద కృష్ణ ఆందోళన చెందుతున్నారని నందిగం పేర్కొన్నారు. అయినా వర్గీకరణ కేంద్ర పరిధిలోని అంశమని, రాష్ట్ర ప్రభుత్వానికి దానితో ఏం సంబంధం అని ప్రశ్నించారు.