Sheela Dikshit: షీలా దీక్షిత్ మృతి పట్ల ప్రధాని మోదీ స్పందన

  • అనారోగ్యంతో కన్నుమూసిన ఢిల్లీ మాజీ సీఎం
  • తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని  
  • అరమరికల్లేని వ్యక్తిత్వం అంటూ కీర్తించిన వైనం
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. షీలా జీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు. స్నేహపూర్వక వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకునేవారంటూ షీలా దీక్షిత్ గురించి పేర్కొన్నారు. ఢిల్లీ అభివృద్ధిలో ఆమె ఎంతో విలువైన భాగస్వామ్యం అందించారని తెలిపారు. షీలా దీక్షిత్ కుటుంబానికి, ఆమె మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తన ట్వీట్ లో పేర్కొన్నారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షీలా దీక్షిత్ చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
Sheela Dikshit
Narendra Modi
New Delhi

More Telugu News