Tirupati: సికింద్రాబాద్-తిరుపతి మధ్య జనసాధారణ్ ఎక్స్‌ప్రెస్.. ఈ నెల 26 నుంచే పరుగులు

  • తిరుపతి వెళ్లే ప్రయాణికులకు శుభవార్త
  • ప్రతి శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు సికింద్రాబాద్‌లో మొదలు
  • తిరుగు ప్రయాణంలో శనివారం ఐదు గంటలకు తిరుపతిలో బయలుదేరనున్న రైలు

సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. ఈ రెండు నగరాల మధ్య జన్‌సాధరణ ఎక్స్‌ప్రెస్ రైలు (07202)ను ప్రారంభించినట్టు తెలిపింది. ఈ నెల 26 నుంచి పరుగులు ప్రారంభించనున్న ఈ రైలు ఆగస్టు 2, 9, 16, 23, 30, సెప్టెంబరు 6, 13, 20, 27వ తేదీల్లో (శుక్రవారం) సాయంత్రం ఐదు గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి శనివారం ఉదయం 6.25 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతి నుంచి రైలు (07201) సాయంత్రం 5 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

  • Loading...

More Telugu News