Kanna Lakshmi Narayana: వైసీపీ కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఏపీ బీజేపీ చీఫ్ కన్నా

  • తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న కన్నా
  • గ్రామాల్లో వైసీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారంటూ ఆగ్రహం
  • వైసీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణ
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసీపీ కార్యకర్తలపై నిప్పులు చెరిగారు. గ్రామాల్లో వైసీపీ కార్యకర్తల దౌర్జన్యాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టిస్తుంటే, వైసీపీ నేతలు భూ ఆక్రమణకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. దౌర్జన్యాలపై ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతూ వేధిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఇదే తరహాలో ప్రవర్తించి ప్రజాగ్రహానికి గురైందని, ఇప్పుడదే బాటలో వైసీపీ ప్రభుత్వం కూడా నడుస్తోందని కన్నా విమర్శించారు. ఇవాళ తిరుపతిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
Kanna Lakshmi Narayana
BJP
Tirupati
YSRCP
Andhra Pradesh

More Telugu News