Mp: నేను చనిపోయే వరకూ ‘కాంగ్రెస్’లోనే కొనసాగుతా: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • ఎట్టి పరిస్థితుల్లోనూ ‘కాంగ్రెస్’ను వీడను
  • నాకు మరో జన్మ ఉంటే ‘కాంగ్రెస్’లోనే ఉంటా
  • కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టీకరణ

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరతారంటూ టీ-కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ పార్టీని వీడనని, తాను చనిపోయే వరకూ ఈ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అంతేకాకుండా, తనకు మరో జన్మ అంటూ ఉంటే కాంగ్రెస్ లోనే ఉంటానంటూ భావోద్వేగంతో చెప్పారు. 

More Telugu News