Andhra Pradesh: ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా జక్కంపూడి రాజా?

  • రాజాను వరించిన మరో పదవి
  • త్వరలో వెలువడనున్న అధికారిక ఉత్తర్వులు  
  • రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
తూర్పు గోదావరి జిల్లా రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాను మరో పదవి వరించినట్టు తెలుస్తోంది. ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్ గా రాజాను ఎంపిక చేస్తూ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి త్వరలో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరొందిన జక్కంపూడి రామ్మోహన్ తనయుడు జక్కంపూడి రాజా. జగన్ కేబినెట్ లో రాజాకు స్థానం దక్కుతుందని భావించారు. అయితే, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు కేబినెట్ పదవి దక్కలేదు. ఈ క్రమంలోనే కాపు కార్పొరేషన్ చైర్మన్ గా రాజాను జగన్ నియమించారని సమాచారం.  
 .  
Andhra Pradesh
Kapu corporation
jakkampudi
Raja

More Telugu News