Ben Stokes: 'న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు నామినేట్ అయిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్

  • క్రైస్ట్ చర్చ్ లో జన్మించిన బెన్ స్టోక్స్
  • ఇప్పటికీ అక్కడే నివసిస్తున్న అతని తల్లిదండ్రులు
  • ఇదే అవార్డుకు పోటీపడుతున్న విలియంసన్
ప్రపంచ కప్ ను ఇంగ్లండ్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్... 'న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్'గా నామినేట్ అయ్యాడు. ఫైనల్స్ లో 84 పరుగులు చేసిన స్టోక్స్... ప్రపంచకప్ లో 465 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ తరపున క్రికెట్ ఆడుతున్న బెన్ స్టోక్స్ జన్మత: న్యూజిలాండ్ పౌరుడు. మరోవైపు, న్యూజిలాండ్ కెప్టెన్ విలియంసన్ కూడా ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు.

ఈ సందర్భంగా న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుల చీఫ్ జడ్జ్ కామెరాన్ బెన్నెట్ మాట్లాడుతూ, న్యూజిలాండ్ తరపున ఆడకపోయినా బెన్ స్టోక్స్ తమ దేశస్తుడేనని చెప్పారు. క్రైస్ట్ చర్చ్ లో స్టోక్స్ జన్మించాడని, అతని తల్లిదండ్రులు ఇక్కడే ఉంటున్నారని తెలిపారు.  

న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు 15 సంవత్సరాల పైబడినవారు అర్హులు. నామినేట్ అయిన వారిలో తుది 10 మందిని డిసెంబర్ లో ప్రకటిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్ వేడుకలో విజేతను ప్రకటిస్తారు.
Ben Stokes
England
New Zealand
New Zealander of the Year
Kane Williamson

More Telugu News