polavaram: పోలవరంలో నిర్వాసితులకిచ్చే ప్యాకేజీ నుంచీ అవినీతే!: ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపణలు

  • ఈప్రాజెక్టు టీడీపీ నాయకుల జేబు నింపింది
  • ఏటీఎంలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకున్నారు
  • త్వరలోనే ఈ అవినీతి బద్దలు కానుంది
ప్రతిష్ఠాత్మకంగా నిర్మించతలపెట్టిన పోలవరం ప్రాజెక్టు టీడీపీ నాయకుల అవినీతికి కేరాఫ్‌గా మారిందని, నిర్వాసితుల కిచ్చే ఆర్‌ఆర్‌ ప్యాకేజీ నుంచే ఆమ్యామ్యాలు మొదలయ్యాయని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ పోలవరంపై మాట్లాడే నైతిక హక్కు తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎంతమాత్రం లేదన్నారు. ఇళ్లు, భూములు నష్టపోయిన నిర్వాసితులకు ఇచ్చే పునరావాస ప్యాకేజీలోను అవకతవకలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. త్వరలోనే ఈ అవినీతి వ్యవహారం బట్టబయలుకానుందని, నిపుణుల కమిటీ నివేదికతో ఎవరి అవినీతి ఎంతో నిగ్గుతేలుతుందని చెప్పారు. విష్ణుతోపాటు పార్టీ నాయకుడు బాలరాజు కూడా మాట్లాడారు.
polavaram
malladi vishnu

More Telugu News