Andhra Pradesh: అధికారం పోయాక మైండ్ మరింత దెబ్బతిన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నారు!: విజయసాయిరెడ్డి ఎద్దేవా

  • కృష్ణా నది భవానీ ద్వీపం నుంచే మొదలవుతుందట
  • ప్రకాశం బ్యారేజ్ కట్టకముందు గెస్ట్ హౌస్ నది బయటే ఉందట
  • ఇదేం వాదన చంద్రబాబూ?
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం పోయాక మైండ్ మరింత దెబ్బతిన్నట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

గూగుల్ మ్యాప్స్ ప్రకారం కృష్ణా నది భవానీ ద్వీపం నుంచే మొదలవుతుందని చంద్రబాబు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రకాశం బ్యారేజీ కట్టకముందు లింగమనేని గెస్ట్ హౌస్ ప్రాంతం నది వెలుపలే ఉండేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఇదేం వాదన? అని ప్రశ్నించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Twitter
Chandrababu
Telugudesam
Lingamaneni guest House

More Telugu News