Andhra Pradesh: బొత్స గారూ.. ‘వోక్స్ వ్యాగన్’లో కొట్టేసిన డబ్బులతోనే కడతారా?: కేశినేని నాని సెటైర్లు

  • బొత్సను టార్గెట్ గా చేసుకున్న కేశినేని
  • దేశంలోనే మంచి రాజధాని నిర్మిస్తామన్న బొత్స
  • బొత్సపై ఉన్న అవినీతి ఆరోపణల్ని ప్రస్తావించిన టీడీపీ ఎంపీ
టీడీపీ నేత, విజయవాడ లోక్ సభ సభ్యుడు కేశినేని నాని వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ వైసీపీ నేత పీవీపీపై విమర్శలు గుప్పించిన కేశినేని, తాజాగా ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై సెటైర్లు వేశారు. ‘ఆంధ్రప్రదేశ్ కు దేశంలోనే మంచి రాజధాని నిర్మిస్తాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు తగ్గట్లు ఈ నిర్మాణం చేపడతాం. ఆంధ్రుల సంస్కృతికి తగట్టు నూతన రాజధాని ఉంటుంది’ అని బొత్స చెప్పడంపై వెటకారంగా స్పందించారు.

దేశంలోనే మంచి రాజధానిని వోక్స్ వ్యాగన్ వ్యవహారంలో కొట్టేసిన డబ్బులతోనే కడతారా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. గతంలో ఏపీ భారీ పరిశ్రమల మంత్రిగా బొత్స ఉన్న సమయంలో వోక్స్ వ్యాగన్ కుంభకోణంలో ఆయన ప్రమేయంపై పెద్ద రగడ జరిగిన సంగతి విదితమే. 
Andhra Pradesh
Botsa Satyanarayana
YSRCP
Telugudesam
Kesineni Nani

More Telugu News