Shivlekh Singh: రోడ్డు ప్రమాదంలో హిందీ సీరియల్స్ బాల నటుడి దుర్మరణం!

  • రాయ్ పూర్ సమీపంలో ఘోర ప్రమాదం
  • శివలేఖ్ సింగ్ దుర్మరణం, అతని తల్లికి తీవ్రగాయాలు
  • 'సంకట్ మోచన్ హనుమాన్'తో ప్రేక్షకులకు దగ్గర
చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ శివార్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలు హిందీ సీరియల్స్ లో నటించి, అన్ని భాషల వారికీ సుపరిచితుడైన బాలనటుడు శివలేఖ్ సింగ్ (14) దుర్మరణం పాలయ్యాడు. రాయ్ పూర్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, శివలేఖ్ సింగ్ ఫ్యామిలీ బిలాస్ పూర్ నుంచి రాయ్ పూర్ కు కారులో వెళుతుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రక్ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో శివలేఖ్ అక్కడికక్కడే మరణించగా, ఆయన తల్లి లేఖ్నా సింగ్, తండ్రి శివేందర్, మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. లేఖ్నా పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. 'సంకట్ మోచన్ హనుమాన్', 'ససురాల్ సిమర్ కా' వంటి హిట్ సీరియల్స్ తో పాటు పలు రియాల్టీ షోలలోనూ శివలేఖ్ నటించాడు.
Shivlekh Singh
Sankatmochan Hanuman
Road Accident

More Telugu News