BigBoss-3: 'బిగ్ బాస్ 3'పై నిరసనల ఎఫెక్ట్.. నాగార్జున నివాసం వద్ద పోలీస్ భద్రత

  • నాగ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించిన ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు
  • జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద బందోబస్తు
  • అనుమానిత వ్యక్తులను తనిఖీలు చేస్తున్న పోలీసులు
అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్న'బిగ్ బాస్ 3' తెలుగు రియాల్టీ టీవీ షో త్వరలోనే ప్రారంభంకానుంది. ఈ షో మహిళలను కించపరిచే విధంగా ఉందని, దీన్ని రద్దు చేయకపోతే నాగార్జున ఇంటిని ముట్టడిస్తామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు హెచ్చరించిన విషయం తెలిసిందే. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్, జూబ్లీహిల్స్ రోడ్ నెం.46 లోని నాగార్జున నివాసం వద్ద ఈరోజు సాయంత్రం నుంచి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనుమానిత వ్యక్తులను, వాహనాలను తనిఖీలు చేస్తున్నారు.
BigBoss-3
Nagarjuna
Jublihills
OU students

More Telugu News