Ram: 'ఇస్మార్ట్ శంకర్' ప్రమోషన్స్ కి రామ్ రాకపోవడానికి కారణం అదేనట!

  • ముందుగా అనుకున్న రిలీజ్ డేట్ ఈ నెల 12
  • స్పెయిన్ లో సరదాగా గడిపేందుకు వెళ్లిన రామ్
  • పూరితో రామ్ కి మనస్పర్థలు లేవన్న సన్నిహితులు   

రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ తెరకెక్కించిన 'ఇస్మార్ట్ శంకర్' ఈ రోజునే థియేటర్స్ కి వచ్చింది. విడుదలకి ముందు జరిగిన ప్రమోషన్స్ లో రామ్ కనిపించలేదు. దాంతో పూరి జగన్నాథ్ కి .. రామ్ కి మధ్య రంగం చెడిందనే ప్రచారం జరిగింది. ఆ వార్తలో ఎంతమాత్రం నిజం లేదనేది తాజా సమాచారం.

ఈ సినిమాను ముందుగా ఈనెల 12వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. దాంతో ఆ వెంటనే తన కుటుంబ సభ్యులతో కలిసి రామ్ స్పెయిన్ వెళ్లడానికి ప్లాన్ చేసుకున్నాడట. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయిన తరువాత, ఈ సినిమా ఈ నెల 18వ తేదీకి వాయిదా పడింది. కుటుంబ సభ్యులందరితో టూర్ ప్లాన్ చేసుకున్న కారణంగా రామ్ ఆగడం కుదరలేదని సమాచారం. అందువల్లనే తప్ప, రామ్ కి .. పూరికి మధ్య ఎలాంటి మనస్పర్థలు తలెత్తలేదనేది సన్నిహితుల మాట. 

More Telugu News