TRS: చంద్రబాబుపై కోపంతోనే టీఆర్ఎస్‌కు ఓట్లు వేశారు: బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి

  • టీఆర్ఎస్ పార్టీ కుల రాజకీయాలకు పాల్పడుతోంది
  • టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయే
  • లోక్‌సభ ఎన్నికల్లో 19 శాతం ఓట్లతో ఆదరించారు
టీఆర్ఎస్ పార్టీ కుల రాజకీయాలకు పాల్పడుతోందని తెలంగాణకు చెందిన బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి ఆరోపించారు. నేడు మహబూబాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుపై కోపంతో ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓట్లు వేశారే కానీ, టీఆర్ఎస్‌పై ప్రేమతో కాదన్నారు. టీఆర్ఎస్‌కు తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీయేనని, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి 19 శాతం ఓట్లు వేసి ఆదరించారని అన్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం దేశ వ్యాప్తంగా సంస్థాగతంగా బలపడేందుకేనని ఇంద్రసేనారెడ్డి తెలిపారు. 2014లో చేపట్టిన సమగ్ర సర్వే టీఆర్ఎస్ పార్టీ కోసమేనని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ఇంటికి పోవడం ఖాయమన్నారు.
TRS
Mahaboobabad
Indrasena Reddy
BJP
Loksabha
KCR

More Telugu News