Sachin Tendulkar: బహుమతి ప్రదానోత్సవంలో కివీస్ కెప్టెన్ విలియమ్సన్ తో తానేం చెప్పిందీ వెల్లడించిన సచిన్

  • వరల్డ్ కప్ ఫైనల్లో దురదృష్టవశాత్తు ఓడిన న్యూజిలాండ్
  • విలియమ్సన్ కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ప్రదానం చేసిన సచిన్
  • నెమ్మదిగా ఉండడమే గొప్ప ఆభరణం అంటూ విలియమ్సన్ కు ప్రశంస
వరల్డ్ కప్ లో కొద్దిలో టైటిల్ చేజార్చుకున్న న్యూజిలాండ్ జట్టుపై అన్నివైపుల నుంచి సానుభూతి వ్యక్తమవుతోంది. లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ ముగిశాక బహుమతి ప్రదానోత్సవంలో కివీస్ సారథి కేన్ విలియమ్సన్ కు 'ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్' అవార్డు అందజేస్తూ సచిన్ టెండూల్కర్ అనునయంగా ఏదో చెబుతూ కనిపించాడు. ఆ రోజు విలియమ్సన్ తో తాను ఏం చెప్పాడో సచిన్ తాజాగా వెల్లడించాడు.

"మీకు ఇది గొప్ప వరల్డ్ కప్. మీ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు" అంటూ విలియమ్సన్ తో చెప్పానని వివరించాడు. తాను విలియమ్సన్ లో గమనించింది అతడి శాంత స్వభావమేనని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రశాంతతను వీడడని సచిన్ కొనియాడాడు. అనూహ్యరీతిలో ప్రపంచకప్ టైటిల్ దూరమైనా ముఖంలో ఆ వేదన కనిపించనీయకుండా సంయమనంతో వ్యవహరించాడని కితాబిచ్చాడు. విలియమ్సన్... నిదానంగా ఉండడమే మీకు గొప్ప ఆభరణం అని కూడా కివీస్ సారథితో చెప్పినట్టు సచిన్ పేర్కొన్నాడు.
Sachin Tendulkar
Kane Williamson
World Cup
New Zealand

More Telugu News