USA: పార్టీ మ్యూజిక్ తో వేధించిన పొరుగింటి వ్యక్తి.. ‘డ్రోన్’తో ప్రతీకారం తీర్చుకున్న వైనం!

  • అమెరికాలోని టెక్సాస్ లో ఘటన
  • పార్టీపై డ్రోన్ తో బాణసంచా ప్రయోగించిన వ్యక్తి
  • భారీ సౌండ్ తో విసిగించడమే కారణం
సాధారణంగా వేడుకలు, పార్టీల సమయంలో ఇరుగుపొరుగువారు మ్యూజిక్ సిస్టమ్ లను హోరెత్తిస్తుంటారు. ప్రత్యేకమైన సందర్భాలు కాబట్టి మనలో చాలామంది ఈ విషయంలో సర్దుకునిపోతుంటారు. అయితే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి మాత్రం పొరుగింటి వ్యక్తి తలనొప్పిగా తయారయ్యాడు. పార్టీ మ్యూజిక్ ను తగ్గించాలని పదేపదే కోరినా అతను పట్టించుకోలేదు.

ఏం చేసుకుంటావో చేసుకో ఫో అని తలబిరుసుగా సమాధానం ఇచ్చాడు. ఇంకెవరైనా అయితే పోలీసులకు సమాచారం ఇచ్చేవారు. అయితే ఆస్టిన్ వాసి మాత్రం భిన్నంగా ఆలోచించాడు. ఓ డ్రోన్ కు బాణసంచా సరంజామా కట్టి పార్టీపై ప్రయోగించాడు. ఇంకేముంది? ఆకాశం నుంచి అవి మీదకు దూసుకొస్తుంటే పార్టీకి హాజరైనవారు ప్రాణాలు అరచేత పెట్టుకుని పరుగెత్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
USA
Texas
loud music
party
america
fire work
Drone
Fire work

More Telugu News