Madhya Pradesh: మధ్యప్రదేశ్ మాజీ సీఎం బాబులాల్ పరిస్థితి విషమం.. ప్రత్యేక విమానంలో ‘మేదాంత’కు తరలింపు

  • ఏడాదిపాటు మధ్యప్రదేశ్‌కు సీఎంగా పనిచేసిన బాబులాల్
  • శ్వాసకోస సమస్యలు, పక్షవాతంతో బాధపడుతున్న గౌర్
  • వరుసగా ఎనిమిదిసార్లు మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నిక

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బాబులాల్ గౌర్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. శ్వాసకోస సమస్యలతోపాటు పక్షవాతంతో ఇబ్బందులు పడుతున్న ఆయన పరిస్థితి బుధవారం విషమించింది. దీంతో ఆయనను ప్రత్యేక విమానంలో గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చొరవతో అధికారులు ప్రత్యేక విమానాన్ని సిద్ధం చేశారు. అలాగే, ఆసుపత్రి నుంచి ఎయిర్‌పోర్టు వరకు తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

23 ఆగస్టు 2004 నుంచి 25 నవంబరు 2005 వరకు బాబులాల్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 89 ఏళ్ల గౌర్ ఏప్రిల్‌లో భోపాల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. బుధవారం ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో మేదాంత ఆసుపత్రికి తరలించారు. 1974లో తొలిసారి గౌర్ మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అత్యయిక స్థితి సమయంలో జనతా పార్టీ తొలి అభ్యర్థి ఆయనే. ఆ తర్వాత వరుసగా ఎనిమిదిసార్లు ఎన్నికయ్యారు. అయితే, వయసు మీద పడడంతో గత రెండుసార్లు ఆయనకు టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించింది.

More Telugu News