బీహార్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించండి: మాజీ సీఎం రబ్రీదేవి

  • బీహార్లో కుండపోత వర్షాలు 
  • 33కు చేరిన మృతుల సంఖ్య
  • తక్షణ ఆర్థిక సాయం అందించాలని కోరిన రబ్రీ
కుండపోత వర్షాల ధాటికి బీహార్ విలవిల్లాడుతోంది. దీంతో సంభవించిన వరదల కారణంగా రాష్ట్రంలో మృతుల సంఖ్య 33కు చేరింది. లోతట్టు ప్రాంతాల్లో జాతీయ విపత్తు దళాలు మోహరించాయి. బీహార్ వరదలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత రబ్రీదేవి స్పందించారు. బీహార్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఆమె ప్రధాని మోదీని కోరారు. నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన రబ్రీదేవి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని, ప్రజలకు నిత్యావసరాలతో పాటు ఆశ్రయం కల్పించాలని కోరారు.
Go Back to Shorts
Bihar
Rabri devi
National Disaster
Narendra Modi

More Telugu News