Andhra Pradesh: సాంకేతిక విషయాలు చెబుతూ లేనిపోని ఆరోపణలు చేస్తారా?: వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్

  • విండ్ వెలాసిటీకి, రోటార్ డయామీటర్ కు పోలిక చెబుతూ ఆరోపణలా?
  • విద్యుత్ ధరలపై దుర్మార్గమైన రాజకీయాలు తగదు
  • మేము అతి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేశాం
టీడీపీ హయాంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను చంద్రబాబునాయుడు తిప్పికొట్టారు. మంగళగిరిలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబు హయాంలో కుదుర్చుకున్న పీపీఏలపై వివరణ ఇచ్చారు.

సాంకేతిక విషయాలు చెబుతూ తమపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. విండ్ వెలాసిటీకి, రోటార్ డయామీటర్ కు పోలిక చెబుతూ ఆరోపణలు చేస్తారా? అని ప్రశ్నించిన చంద్రబాబు, విద్యుత్ ధరలపై దుర్మార్గమైన రాజకీయాలు చేస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హయాంలో అతి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. జగన్ కు రెండు విద్యుదుత్పత్తి ప్లాంట్ లు ఉన్నాయని, వాటి ద్వారా డెవలపర్ గా సంపాదించుకున్నారని విమర్శించారు. 
Andhra Pradesh
Telugudesam
ppa
YSRCP
jagan

More Telugu News