cm: సీఎం జగన్ ని కలిసిన వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్

  • జగన్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ద్రోణంరాజు
  • వీఎంఆర్డీఏ చైర్మన్ గా నియమించడంపై కృతఙ్ఞతలు
  • జగన్ కు శాలువా కప్పి సన్మానించిన ద్రోణంరాజు
విశాఖపట్టణం మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (వీఎంఆర్డీఏ) చైర్మన్ గా వైసీపీ సీనియర్ నేత ద్రోణంరాజు శ్రీనివాస్ ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ని నేడు ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్ లో జగన్ ని కలిసి శాలువాతో సత్కరించిన ద్రోణంరాజు, తనను వీఎంఆర్డీఏ చైర్మన్ గా నియమించినందుకు కృతఙ్ఞతలు తెలిపారు. విశాఖ నగరం, పర్యాటకం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ద్రోణంరాజు చెప్పారు.
cm
jagan
VMRDA
Dronam Raju
srinivas

More Telugu News