Vijayawada: మసీదు, మదర్సాల నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తాం: ఏపీ మంత్రి వెల్లంపల్లి

  • విజయవాడలో కొత్త మసీదుల నిర్మాణ పనులు  
  • మైనారిటీల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తుంది
విజయవాడలో కొత్త మసీదుల నిర్మాణపనులను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు ప్రారంభించారు. విజయవాడలోని పాత రాజరాజేశ్వరి పేట, జండా చెట్టు సందులో కొత్త మసీదు స్లాబ్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ, అన్ని వర్గాల వారికి న్యాయం చేసే విధంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని, మైనారిటీల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మసీదు, మదర్సాల నిర్మాణానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.
Vijayawada
Minister
Vellampalli
Mosque

More Telugu News