Manchu Manoj: నారాయణఖేడ్ అడ్రస్ తో 'ఓటరు కార్డు'పై మంచు మనోజ్ స్పందన

  • మంచు మనోజ్ కు నారాయణఖేడ్ లో ఓటు ఉందంటూ మీడియాలో వార్తలు
  • అది తప్పుడు ఓటరు కార్డు అని పేర్కొన్న మంచు మనోజ్
  • అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ట్వీట్

తన పేరిట సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో ఓటు ఉందంటూ వస్తున్న కథనాలపై సినీ నటుడు మంచు మనోజ్ స్పందించారు. ఓ మీడియా సంస్థ తన ఓటరు కార్డును ప్రదర్శిస్తూ కథనం రాశారని, అందులో పేర్కొన్న ఓటరుకార్డు తప్పుడు ఓటరు కార్డు అని మనోజ్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. మీడియాలో చూపిస్తున్న ఓటరు కార్డులో నారాయణఖేడ్ చిరునామా ఉందని, వాస్తవానికి తన ఓటరు కార్డులో ఫిలింనగర్ చిరునామా ఉంటుందని వెల్లడించారు. ఈ విషయంలో అధికారులు చర్యలు తీసుకోవాలని మంచు మనోజ్ కోరారు.

  • Loading...

More Telugu News