Manikyala Rao: ఏపీలో రెండు పార్టీలు మూతపడబోతున్నాయి: మాణిక్యాలరావు

  • రాజకీయ పార్టీలకు మిత్రపక్షం, శత్రుపక్షం ఉండదు
  • అసెంబ్లీలో సభ్యుల తీరు దారుణంగా ఉంది
  • సభలో అభ్యంతరకరమైన భాషను వాడటం మంచిది కాదు
ఏపీలో రెండు పార్టీలు మూతపడబోతున్నాయని బీజేపీ  నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరెవరు బీజేపీలో చేరబోతున్నారో ఇప్పుడే చెబితే... సస్పెన్స్ ఉండదని అన్నారు. రాజకీయ పార్టీలకు మిత్రపక్షం, శత్రుపక్షం ఉండదని అన్నారు. బీజేపీ ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుందని చెప్పారు.

ఏపీ అసెంబ్లీలో సభ్యుల తీరు దారుణంగా ఉందని మాణిక్యాలరావు విమర్శించారు. టీడీపీ హయాంలో నడిచిన విధంగానే సభ ఇప్పుడు కూడా నడుస్తోందని అన్నారు. అప్పుడు, ఇప్పుడు వ్యక్తిగత దూషణలతోనే సభ నడుస్తోందని చెప్పారు. చట్ట సభల్లో అభ్యంతరకరమైన భాషను వాడటం మంచిది కాదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వకపోయినా... రాష్ట్రానికి అన్ని ప్రయోజనాలు వస్తున్నాయని చెప్పారు.
Manikyala Rao
BJP

More Telugu News