PVP: 'డియర్, టీవీ 5 యజమానులు, యాంకర్లు...!' అంటూ పీవీపీ వార్నింగ్

  • విజయవాడ నేతల మధ్య మాటల యుద్ధం
  • లా బ్రేక్ చేసే మీకు నా లా పవర్ చూపిస్తా
  • ఇది రేపు కూడా కొనసాగుతుందన్న పీవీపీ
విజయవాడ రాజకీయ నాయకుల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటికే ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నల మధ్య ట్వీట్ల వార్ జరుగుతుండగా, దానిలోకి ఎంపీ సీటుకు పోటీ చేసి ఓటమి పాలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి, వ్యాపారవేత్త పీవీపీ ఎంటరైన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ ఉదయం పీవీపీ మరో సంచలన ట్వీట్ పెట్టారు. మీడియా మిత్రులకు తన లా పవర్ చూపుతున్నానని అన్నారు.  "నా ప్రియమైన టీవీ5 యాజమాన్యం, సంపాదకులు, యాంకర్లకు... లా బ్రేక్ చేసే మీలాంటి మీడియా మిత్రులకు ఆ లా యొక్క పవర్ చూపించడానికి మరో చిరు టీజర్ నా తరఫున. మీ హక్కులు ఎక్కడ ముగుస్తాయో... నా చికిత్స అక్కడ ప్రారంభమవుతుంది. ఈ షో రేపు కూడా కొనసాగుతుంది..." అని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు.
PVP
TV5
Vijayawada
Twitter

More Telugu News