Sri Lanka: శ్రీలంకకు యుద్ధ నౌకను గిఫ్ట్‌గా ఇచ్చిన చైనా

  • కొలంబో చేరుకున్న 'పీ 625' నౌక 
  • ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకుంటున్న చైనా
  • త్వరలోనే 9 కొత్త రకం రైళ్లు కూడా
శ్రీలంకతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకునే క్రమంలో చైనా కొత్త వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలో ఓ పోర్టును నిర్మిస్తున్న చైనా.. తాజాగా ఓ యుద్ధనౌకను ఆ దేశానికి బహుమతిగా అందించింది. అలాగే, త్వరలోనే 9 కొత్త రకం రైళ్లను కూడా అందించనున్నట్టు చైనా ప్రకటించింది. ‘పీ 625’గా పిలిచే ఈ నౌక గత వారమే కొలంబో చేరుకుంది. శ్రీలంక దీనిని తీరప్రాంత గస్తీకి, సముద్ర దొంగలపై పోరాటానికి వినియోగించే అవకాశం ఉందని సమాచారం. యుద్ధ నౌకను తమకు బహుమానంగా ఇచ్చిన చైనాకు శ్రీలంక కృతజ్ఞతలు తెలిపింది.  
Sri Lanka
China
p625 war ship

More Telugu News