Andhra Pradesh: ఈ సైజ్ లో పెరిగాడు.. బుర్ర మాత్రం అరికాలులో కూడా లేదు: అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ ఫైర్

  • చంద్రబాబును ‘విలన్’గా అభివర్ణించిన జగన్
  • ఈ వ్యాఖ్యలపై టీడీపీ సభ్యుల అభ్యంతరం
  • అచ్చెన్నాయుడు బుర్ర ఎందుకు పెరగలేదో ఆయనే ప్రశ్నించుకోవాలి
టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై ఏపీ సీఎం జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలో భాగంగా చంద్రబాబు వ్యాఖ్యలకు జగన్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును ‘విలన్’గా జగన్ అభివర్ణించడంపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అచ్చెన్నాయుడుపై జగన్ మండిపడ్డారు. ‘అచ్చెన్నాయుడు మనిషేమో ఈ సైజ్ లో పెరిగాడు. బుర్ర మాత్రం అరికాలులో కూడా ఉండటం లేదు. బుర్ర  ఎందుకు పెరగలేదో ఆయనే ప్రశ్నించుకోవాలి’ అంటూ విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలతో టీడీపీ సభ్యులు మరింత మండిపడ్డారు. 
Andhra Pradesh
assembly
jagan
atchainaidu

More Telugu News