Andhra Pradesh: ప్రతి గ్రామ సచివాలయంలో ఓ మహిళా కానిస్టేబుల్ ను నియమిస్తాం: సుచరిత

  • శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు ఏపీ హోంమంత్రి సమాధానాలు
  • మహిళల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్య అంశమన్న మంత్రి
  • మచిలీపట్నం ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నంపై ఎఫ్ఐఆర్ నమోదైందంటూ వెల్లడి

ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత రాష్ట్ర శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు జవాబులిచ్చారు. ఈ క్రమంలో కొత్తగా కొలువుదీరే ప్రతి గ్రామ సచివాలయంలో విధిగా ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో మహిళల భద్రతే తమ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశమని తెలిపారు. మహిళలు ఉద్యోగాలు, ఇతర పనులు చేసే ప్రదేశాల్లో శక్తి పోలీస్ టీమ్ సభ్యులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారని మంత్రి వివరించారు. ఇక ప్రకాశం జిల్లా చినగంజాంలో టీడీపీ మహిళా కార్యకర్త ఆత్మహత్యకు పక్కింటివాళ్లతో గొడవలే కారణమని, మచిలీపట్నంలో ఆశా కార్యకర్త ఆత్మహత్యాయత్నంపై ఎఫ్ఐఆర్ నమోదైందని మండలిలో వెల్లడించారు.

More Telugu News