Payyavula Keshav: కేంద్రం చర్యలతో జగన్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది: పయ్యావుల కేశవ్

  • పీపీఏలపై రాద్ధాంతం చేయాలనుకుంది
  • రాష్ట్ర ప్రభుత్వ చర్యలను కేంద్రం తప్పుబట్టింది
  • టీడీపీని దోషిగా చూపించడంపైనే వైసీపీ దృష్టి సారించింది
విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన పీపీఏలపై వైసీపీ ప్రభుత్వం రాద్ధాంతం చేయాలనుకుందని... అయితే, కేంద్ర ప్రభుత్వ స్పందనతో వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయిందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను కేంద్రం తప్పుబట్టడంతో.... పరువు నిలుపుకునే ప్రయత్నాన్ని జగన్ ప్రభుత్వం చేస్తోందని అన్నారు. పీపీఏలలో ప్రభుత్వ జోక్యం చాలా తక్కువ ఉంటుందనే విషయాన్ని జగన్ ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పారు. టీడీపీని దోషిగా చూపించడంపై వైసీపీ నేతలు దృష్టి సారించారని అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, పయ్యావుల పైవ్యాఖ్యలు చేశారు.
Payyavula Keshav
Jagan
Telugudesam
YSRCP

More Telugu News