Jagan: వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు అటెండెన్స్ వేయండి: జగన్ ఆదేశం

  • అసెంబ్లీలో టీడీపీపై మరింత దూకుడుగా వ్యవహరించాలని జగన్ నిర్ణయం
  • టీడీపీ విమర్శలు చేస్తున్న సమయంలో సభలో తక్కువగా ఉంటున్న వైసీపీ సభ్యులు
  • అటెండెన్స్ వేసి, ప్రతిరోజు తనకు నివేదిక ఇవ్వాలని చీఫ్ విప్ కు ఆదేశం
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష టీడీపీపై మరింత దూకుడుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈరోజు నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు తప్పనిసరిగా అటెండెన్స్ వేయాలనే కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి చెందిన ప్రతి సభ్యుడు ఏ సమయానికి సభకు వస్తున్నారు, ఏ సమయానికి వెళ్లిపోతున్నారు అనే అంశంపై దృష్టి పెట్టాలని చీఫ్ విప్ కు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి రోజు సభ్యుల హాజరుపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సభలో టీడీపీ బలం చాలా తక్కువగా ఉన్నప్పటికీ... అధికారపక్షాన్ని వారు దీటుగానే ఎదుర్కొంటున్నారు. టీడీపీ విమర్శలు చేస్తున్న సమయంలో సభలో ఎక్కువ మంది వైసీపీ సభ్యులు ఉండటం లేదని జగన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ సభ్యులకు అటెండెన్స్ వేయాలనే నిర్ణయానికి వచ్చారు.
Jagan
YSRCP
Assembly
Attendance

More Telugu News