Chandrababu: రాజేంద్రనాథ్ రెడ్డిగారూ... హ్యాట్సాఫ్... మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా: చంద్రబాబు సెటైర్

  • వైఎస్ చొరవ కారణంగానే ఏపీకి కియా
  • అసెంబ్లీలో బుగ్గన వ్యాఖ్యలపై చంద్రబాబు వ్యంగ్యాస్త్రాలు
  • వైఎస్ ఆత్మ వెళ్లి కియాను తెచ్చిందని సెటైర్
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న చొరవ కారణంగానే ఆంధ్రప్రదేశ్ కు కియా మోటార్ల పరిశ్రమ వచ్చిందని చెబుతూ, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభకు తెలియజేయడాన్ని విపక్షనేత చంద్రబాబు తీవ్రంగా ఆక్షేపించారు. "రాజేంద్రనాథ్ రెడ్డిగారూ... చాలా తెలివైన వాళ్లు మీరు. హ్యాట్సాఫ్. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే, 2009లో రాజశేఖరరెడ్డి చనిపోయారు. ఆయన ఆత్మ వెళ్లింది ఆ సీఈఓ దగ్గరకు. 2016లో మీరు చంద్రబాబునాయుడి దగ్గరకు వెళ్లండి. ఆయన అన్నీ ఇస్తారు. ఇన్సెంటివ్స్ అన్నీ. అన్ని పనులు చేస్తారు.... పెట్టమని ఆయన చెప్పారు. ఆయనొచ్చి పెట్టారు. అదీ మీరు చెప్పే కథ. ఏం చెప్పాల? మీరు ఎంత గొప్పనాయకులంటే, ఇలాంటి అసత్యాలను కూడా సత్యంగా చెప్పే మనస్తత్వం మీకుంది. మీకు కంగ్రాచ్యులేషన్స్" అని చంద్రబాబు సెటైర్లు వేశారు.
Chandrababu
YSR
andh
Kia

More Telugu News