Kesineni Nani: నిజమే... బాలయోగి ఆస్తులు కాజేశాను: కేశినేని నాని

  • ఓ ప్రబుద్ధుడు చెప్పింది వాస్తవం
  • బాలయోగి ఆస్తి నీతి, నిజాయతీ
  • వాటిని కాజేసి పాటిస్తున్నానన్న నాని
తాను బాలయోగి ఆస్తులు కాజేసిన మాట వాస్తవమేనని విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ఓ ప్రబుద్ధుడు చెప్పిన మాటలు వాస్తవమేనని అన్నారు. "నేను బాలయోగి ఆస్తులు కాజేశానని ఒక్క ప్రబుద్ధుడు చెప్పింది యదార్థం. బాలయోగికి ఉన్న ఆస్తులు నీతి, నిజాయితీ, విలువలు, సిద్ధాంతాలు, ప్రజల పట్ల అంకితభావం, ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి. వీటిని కాజేసి, పాటిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను" అని పేర్కొన్నారు. 
Kesineni Nani
Balayogi
Twitter

More Telugu News