Geeta Singh: ఎంతోమంది నాకు ఇవ్వవలసిన డబ్బులు ఎగ్గొట్టారు: హాస్యనటి గీతా సింగ్

  • అవకాశాలు రావడమే తక్కువ
  •  డబ్బులు ఎగ్గొట్టేవాళ్లు ఎక్కువ
  •  గట్టిగా అడగలేననేదే వాళ్ల ధైర్యం   
హాస్యనటిగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న గీతా సింగ్, కెరియర్ పరంగా తనకి ఎదురవుతోన్న ఇబ్బందులను గురించి ప్రస్తావించారు. "ఇండస్ట్రీలో వేషాలు రాకపోతే ఒక బాధ .. వేషం వేసినా అందుకు సంబంధించిన పారితోషికం అందకపోతే మరో బాధ.

సినిమాలకి .. ఆయా ఈవెంట్లకి సంబంధించిన డబ్బులు చాలా వరకూ రావలసినవి వున్నాయి. చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా అవి రావడం లేదు. గట్టిగా డబ్బులు అడగలేననేదే వాళ్ల ఉద్దేశం. ఒక ఆడపిల్ల గడపదాటి వచ్చి ఎందుకు కష్టపడి పనిచేస్తోందనే సానుభూతి కూడా చాలామందిలో కనిపించడం లేదు. ఒకే ఫీల్డులో ఉంటూ గట్టిగా అడగలేము .. మరెవరికీ ఫిర్యాదు చేయలేము" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 
Geeta Singh

More Telugu News