టిప్‌టాప్‌గా వచ్చి.. టిక్‌టాక్‌ల్లో బిజీ అయిపోతున్నారు!

- చక్కగా రెడీ అయి కార్యాలయానికి వస్తారు
- విధులను పక్కన పడేసి టిక్‌టాక్ చేస్తారు
- సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి
ఖమ్మం నగర నడిబొడ్డున ఉండే నగరపాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న తంతు ఇది. ప్రతినిత్యం తమ తమ సమస్యల కోసం ప్రజలు వచ్చిపోయే కార్యాలయం. ఇక్కడి ఉద్యోగులు పొద్దునే చక్కగా రెడీ అయి కార్యాలయానికి వస్తారు. వచ్చి తమ విధులను పక్కన పడేసి, అంతా కలిసి మెలిసి టిక్‌టాక్ చేసి అప్‌లోడ్ చేస్తుంటారు. ప్రస్తుతం వీరు అప్‌లోడ్ చేసిన టిక్‌టాక్‌లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తమ పనులను పెండింగ్‌లో పెట్టి అధికారులంతా ఇలా టిక్‌టాక్‌ల్లో మునిగి పోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు.