Telangana: నూతన పురపాలక చట్టంపై శరవేగంగా పావులు కదుపుతున్న తెలంగాణ ప్రభుత్వం

  • 17న  మంత్రివర్గ సమావేశం
  • 18న అసెంబ్లీ, 19న మండలి సమావేశం
  • కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం

నూతన పురపాలక చట్టం బిల్లుపై ఆమోద ముద్ర వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం శరవేగంగా పావులు కదుపుతోంది. దీనిలో భాగంగా ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశంతో పాటు మండలి కూడా సమావేశమై బిల్లుపై చర్చ జరిపి ఆమోదముద్ర వేయనున్నారు. ఈ నేపథ్యంలో 17న మంత్రివర్గ సమావేశం, 18న అసెంబ్లీ, 19న మండలి సమావేశం జరగనున్నాయి. ఈ సమావేశాల్లో నూతన పురపాలక బిల్లుపై సమగ్ర చర్చ జరిపిన అనంతరం ఆమోదముద్ర వేస్తారు. దీనిపై తెలంగాణలోని పలు కీలక అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. పురపాలక ఎన్నికల నిర్వహణ, సాగు సంబంధిత అంశాలు, వర్షాభావ పరిస్థితులు తదితర అంశాలపై కేబినెట్ ముఖ్యంగా చర్చించనుంది.

More Telugu News