Naga Shaurya: నాగశౌర్య హీరోగా, క్రిష్ దర్శకుడిగా రాఘవేంద్రరావు సినిమా

  • నిర్మాతగా రాఘవేంద్రరావు 
  • కొత్త ప్రాజెక్ట్ కు ఒక దర్శకుడిగా ఎంపికైన క్రిష్ 
  • త్వరలోనే మిగతా వివరాలు  

నాగశౌర్య కథానాయకుడిగా రాఘవేంద్రరావు ఒక సినిమాను నిర్మించనున్నట్టు ఇటీవల ఒక వార్త షికారు చేసింది. ఆ వార్త నిజమేనన్నది తాజా సమాచారం. నాగశౌర్య హీరోగా ముగ్గురు హీరోయిన్లతో ఈ సినిమా రూపొందనుంది. ఈ ముగ్గురు కథానాయికల జోడీగా కనిపించేది నాగశౌర్యయేననే టాక్ వినిపిస్తోంది. కథా పరంగా మూడు ప్రేమకథలు నడుస్తూ ఉంటాయట.

కొత్తదనం కోసం ఈ మూడు ప్రేమకథలను రూపొందించడానికిగాను రాఘవేంద్రరావు ముగ్గురు దర్శకులను తీసుకోనున్నారట. ఆల్రెడీ క్రిష్ ను ఒప్పించడం జరిగిపోయిందనీ, మిగతా ఇద్దరు దర్శకులు ఎవరనేది త్వరలోనే తెలుస్తుందని అంటున్నారు. గోపీమోహన్ .. బీవీఎస్ రవి ఈ సినిమాకి స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. 

  • Loading...

More Telugu News