Sensex: ఇన్ఫోసిస్ జోరు.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 160 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 36 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • ఐటీ స్టాకుల అండతో లాభాల్లో ట్రేడ్ అయిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఐటీ స్టాకుల అండతో మార్కెట్లు ఈరోజు పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్ 7 శాతానికి పైగా లాభపడింది. రూ. 3,802 కోట్ల లాభాలు వచ్చినట్టు ఇన్ఫోసిస్ ప్రకటించడంతో, ఆ కంపెనీ షేర్ దూసుకుపోయింది. దీనికి తోడు అంతర్జాతీయంగా నెలకొన్న సానుకూలతలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను బలపరిచాయి. ఈ నేపథ్యంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 160 పాయింట్లు లాభపడి 38,897కి పెరిగింది. నిఫ్టీ 36 పాయింట్లు పెరిగి 11,588 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇన్ఫోసిస్ (7.20%), సన్ ఫార్మా (3.61%), మారుతి సుజుకి (1.81%), టీసీఎస్ (1.77%), టెక్ మహీంద్రా (1.73%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-2.38%), ఎల్ అండ్ టీ (-1.84%), ఐటీసీ (-1.47%), భారతి ఎయిర్ టెల్ (-1.35%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.09%).

More Telugu News