YSRCP: వైసీపీ మేనిఫెస్టోలా బడ్జెట్ పుస్తకం ఉంది: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • రాష్ట్రాభివృద్దికి దోహదపడేలా బడ్జెట్ లేదు
  • ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని తక్కువ చేసి చూపిస్తున్నారు
  • గత ప్రభుత్వంపై బురద చల్లేందుకు యత్నిస్తున్నారు
వైసీపీ ప్రబుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రాభివృద్దికి దోహదపడేలా లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ, బడ్జెట్ పుస్తకాన్ని వైసీపీ మేనిఫెస్టోలా తయారు చేశారని దుయ్యబట్టారు. గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని తక్కువ చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో తలసరి ఆదాయాన్ని రూ. 93 వేల నుంచి లక్షన్నర రూపాయలకు పైగా పెంచామని చెప్పారు. 5 లక్షలకు పైగా ఉద్యోగాలు రావడం టీడీపీ ప్రభుత్వ ఘనత కాదా? అని ప్రశ్నించారు. జీడీపీ వృద్ధి రేటు 10.82 శాతానికి పెరగడం అభివృద్ధి కాదా? అని అడిగారు. గత ప్రభుత్వంపై బురద చల్లేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వాస్తవ పరిస్థితులను ప్రజల దృష్టికి తీసుకొచ్చేలా బడ్జెట్ లేదని అన్నారు.
YSRCP
Gorantla Butchaiah Chowdary
Telugudesam
Budget

More Telugu News