karthikeya: ఆకట్టుకుంటోన్న 'గుణ 369' సాంగ్

  • అర్జున్ జంధ్యాల దర్శకుడిగా 'గుణ 369 
  • నాయికగా 'అనఘ' పరిచయం
  • కొత్తగా అనిపిస్తోన్న చైతన్ బాణీ  

అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో 'గుణ 369' సినిమా రూపొందుతోంది. కార్తికేయ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికగా 'అనఘ' నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు.

"కలలో కూడా కష్టం కదే ఈ హాయి .. కథ మొత్తం తిప్పేశావే అమ్మాయి .. వదలకుండా పట్టుకుంటా నీ చేయి .. నువ్వు అట్టా నచ్చేశావోయ్ అబ్బాయి" అంటూ ఈ పాట సాగుతోంది. మేకింగ్ షాట్స్ ను బట్టి ఈ పాటను నాయకా నాయికలపై చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. నాయకా నాయికలు ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమను వ్యక్తం చేసుకునే భావజాలంతో ఈ పాటను ఆవిష్కరించారు. చైతన్ భరద్వాజ్ స్వరపరిచిన బాణీ కొత్తగా అనిపిస్తోంది. అనంత్ శ్రీరామ్ సాహిత్యం.. నకష్ అజీజ్ - దీప్తి పార్థసారధి ఆలాపన ఆకట్టుకునేలా వున్నాయి.

More Telugu News