Nandi Awards: జగన్ కు గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి విన్నపం... మొన్నటి దాకా ఏం చేశారని ట్రోలింగ్!

  • 2014-16 అవార్డులను ప్రకటించిన కమిటీ
  • అవార్డులను అందించని ప్రభుత్వం
  • ఇచ్చేది డౌటేనంటున్న నెటిజన్లు

2014 నుంచి 2016 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డులను ప్రకటించిన తరువాత కూడా అవార్డుల బహూకరణ జరగలేదని, దీనిపై సీఎం వైఎస్ జగన్ దృష్టిని సారించి, వెంటనే అవార్డులను ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రముఖ మాటల, గేయ రచయిత దరివేముల రామ జోగయ్య శాస్త్రి సీఎం జగన్ కు విన్నవించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఓ ట్వీట్ ను పెట్టగా, నెటిజన్ల నుంచి ట్రోలింగ్స్ మొదలయ్యాయి.

ఐదేళ్ల నాటి ఈ విషయంలో మొన్నటి దాకా ఏం చేశారని కొందరు ప్రశ్నిస్తుండగా, మరికొందరు మాత్రం రాష్ట్ర విభజన జరిగిన ఆ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమ అవార్డులు ఎప్పటికీ రావని అంటున్నారు. గడచిన నాలుగేళ్లలో చంద్రబాబును ఇదే విషయంపై ఎందుకు అడగలేదని ప్రశ్నిస్తున్నారు. ఇదే సమయంలో ఆ సంవత్సరం 'లెజండ్స్'కు అవార్డులు ప్రకటించారని, అందుకే ఆ విషయాన్ని ఇక మరచిపోవాలని కూడా సలహా ఇస్తున్నారు. 

More Telugu News