Amala Paul: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మళ్లీ ప్రేమలో పడిన కథానాయిక 
  • నితిన్ సినిమాలో హెబ్బా పటేల్ 
  • కీలక పాత్ర పోషిస్తున్న రష్మీ

*  తాను ప్రస్తుతం ఒక వ్యక్తితో ప్రేమలో వున్నట్టు కథానాయిక అమలాపాల్ తెలిపింది. ఆయన సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి కాదని, అయితే ప్రస్తుతం పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం తమకు లేదని చెప్పింది. గతంలో దర్శకుడు ఏఎల్ విజయ్ ని ప్రేమ వివాహం చేసుకుని మనస్పర్థల కారణంగా ఆయన నుంచి అమలాపాల్ విడిపోయిన సంగతి విదితమే.
*  ఇటీవలి కాలంలో తెలుగులో సినిమాలు తగ్గిపోయిన కథానాయిక హెబ్బా పటేల్ కు తాజాగా నితిన్ సినిమాలో అవకాశం వచ్చింది. వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న 'భీష్మ' చిత్రంలో ఓ కీలక పాత్రకు హెబ్బా పటేల్ ను తీసుకున్నారట.
*  'జబర్దస్త్' టీవీ షో ద్వారా పాప్యులర్ అయిన అందాలభామ రష్మీ గౌతం తాజాగా ఓ సినిమాలో నటించడానికి అంగీకరించింది. ఓంకార్ దర్శకత్వం వహించే 'రాజుగారి గది-3'  లో ఓ కీలక పాత్రలో నటించడానికి రష్మీ ఒప్పుకుంది. 

  • Loading...

More Telugu News