President Of India: షార్‌లో రెండో వాహన అనుసంధాన భవనాన్ని జాతికి అంకితం చేసిన రాష్ట్రపతి

  • ప్రత్యేక హెలికాప్టర్‌లో షార్‌కు చేరుకున్న రాష్ట్రపతి
  • జీఎస్ఎల్‌వీ మార్క్-3 వాహక నౌక వీక్షణ
  • నక్షత్ర అతిథి గృహంలో బస
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లిన రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దంపతులు తిరుగు ప్రయాణంలో ఆదివారం రేణిగుంట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీహరికోట చేరుకున్నారు. కోవింద్‌కు అక్కడ ఘన స్వాగతం లభించింది. అనంతరం షార్‌లో రూ. 629 కోట్లతో నిర్మించిన రెండో వాహన అనుసంధాన భవనాన్ని జాతికి అంకితం చేశారు. తర్వాత రెండో ప్రయోగ వేదిక వద్దకు వెళ్లి చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని పంపనున్న జీఎస్ఎల్‌వీ మార్క్-3 ఎం1 వాహన నౌకను వీక్షించారు. అనంతరం నక్షత్ర అతిథి భవనానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు.  

కాగా, ఈ తెల్లవారుజామున 2:51 గంటలకు నిర్వహించాల్సిన చంద్రయాన్-2 ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు అర్ధంతరంగా నిలిపివేశారు. వాహక నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగాన్ని తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో ప్రకటించనున్నారు.  
President Of India
Ramnath kovind
sriharikota
GSLV

More Telugu News