ఇండోనేషియాలో భారీ భూకంపం

  • రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.3గా నమోదు
  • టెర్నాటే నగరానికి ఆగ్నేయంగా భూకంప కేంద్రం గుర్తింపు
  • సునామీ ముప్పుపై స్పష్టతలేని వైనం
పసిఫిక్ మహాసముద్రంలో మరోసారి ప్రకంపనలు వచ్చాయి. ఇండోనేషియా తూర్పుతీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.3గా నమోదైంది. టెర్నాటే నగరం సమీపంలో ఈ భూకంప కేంద్రం ఉన్నట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. టెర్నాటే నగరానికి ఆగ్నేయదిశగా 10 కిలోమీటర్లు లోతున భూకంపం ఏర్పడినట్టు నిపుణులు పేర్కొన్నారు.

రింగ్ ఆఫ్ ఫైర్ గా పేర్కొనే ప్రమాదకర జోన్ లో ఇండోనేషియా దీవులు కూడా ఉన్నాయి. ఇక్కడ తరచుగా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు తమ ప్రభావం చూపిస్తుంటాయి. కాగా, తాజా భూకంపం నేపథ్యంలో నష్టం తాలూకు వివరాలు తెలియాల్సి ఉంది. ఈ భూకంపంతో సునామీ వచ్చే అవకాశాలపైనా స్పష్టత రాలేదు.
Go Back to Shorts
Indonesia
Earthquake

More Telugu News